‘ఉమ్మడి వరంగల్‌ను సస్యశ్యామలం చేస్తాం’

16 Aug, 2019 12:01 IST|Sakshi

అన్నివర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

సాక్షి, వరంగల్‌:  తెలంగాణ రాష్ట్ర్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపారన్నారు. ఉచితంగా చేప పిల్లలతో పాటు, సబ్సిడీతో వాహనాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎస్సీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని తెలిపారు.

ప్రతి కుటుంబానికి బర్రెలు ఇప్పించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందిస్తానని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి 60 రోజుల ప్రణాళికను కేసీఆర్‌ రూపొందించారని వివరించారు. వచ్చే నాలుగు నెలల్లో దేవాదుల నుంచి 365 రోజుల పాటు నీటిని ఎత్తిపోస్తామన్నారు.. మల్కాపూర్‌ రిజర్వాయర్‌ పనులను త్వరలో ప్రారంభించనునట్లు తెలిపారు. దేవాదుల నీటితో ఉమ్మడి వరంగల్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు