కోవిడ్‌ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’

28 Feb, 2020 18:39 IST|Sakshi

చికెన్‌కు కరోనా వైరస్‌కు సంబంధం లేదు: మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: చికెన్ తింటే కరోనా వైరస్ (కోవిడ్‌-19) వస్తుందనే అసత్య ప్రచారాలను నమ్మొద్దని, కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో.. భారత్‌లో కోడి మాంసం తిని ఎవరూ చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ఆసత్య ప్రచారాలను తిప్పికొంట్టేందుకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ ఎగ్స్ మేళాలో ఆయన పాల్గొన్నారు.

‘సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న పలు ఉదంతాల నేపథ్యంలో చికెన్, గుడ్ల విక్రయాలు, వినియోగం తగ్గిపోయింది. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి వ్యయం రూ.77 ఉంటే రూ.30 నుంచి 35 అమ్మాల్సి వస్తుంది. గుడ్డు ఉత్పత్తి రూ.4 ఉంటే 2.80 చొప్పున విక్రయించాల్సి వస్తుంది. గత రెండు మాసాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది’అని ఈటల పేర్కొన్నారు. చికెన్ ఎగ్స్ మేళాను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

100 రకాల వంటకాలు..
గంగ పుత్రులు, ముదిరాజులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్‌లో జరగుతున్న ఫిష్ ఫెస్టివల్‌లో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఫెస్టివల్ లో 100రకాల చేపల వంటకాలు ఉన్నాయని తెలిపారు. బేగం బజార్,  ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రభుత్వం పెద్ద చేపల మార్కెట్ కట్టిస్తుందని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్‌కు ఒక ఔట్ లెట్ ఇస్తున్నామని చెప్పారు. చేపలు,చికెన్ తింటే కరోన వైరస్ రాదని మంత్రి స్పష్టం చేశారు. (కోవిడ్‌-19 : స్విస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్‌

మరిన్ని వార్తలు