తెలంగాణలో మరో 49 కరోనా కేసులు

8 Apr, 2020 20:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది కరోనాతో మృతిచెందారని చెప్పారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుని మొత్తం 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1100 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు చెప్పారు. వారు కాంటాక్ట్‌ అయిన 3 వేల మందిని క్వారంటైన్‌ చేసినట్టు వెల్లడించారు. ఇంకా ప్రభుత్వం దగ్గర 535 శాంపిల్స్‌ మాత్రమే ఉన్నాయని అన్నారు. 

ప్రస్తుతం తెలంగాణలో 397 మంది కరోనా బాధితులు చికిత్స పొందున్నారని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్‌-95 మాస్కుల కొరత ఉందన్నారు. 5 లక్షల పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌(పీపీఈ) కిట్స్‌, 2 కోట్ల డాక్టర్‌ మాస్క్‌లు, కోటి గ్లౌజ్‌లు, 3.50 లక్షల టెస్ట్‌కిట్స్‌కు ఆర్డర్‌ ఇచ్చామని చెప్పారు. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 బెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. 22 ప్రైవేటు మెడికల్‌ కాలేజ్‌లను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చడానికి అంగీకరించారని చెప్పారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజ్‌లతో 15,040 బెడ్స్‌ అందుబాటులోకి వస్తాయని అన్నారు. తెలంగాణలో మందుల కొరత లేదని స్పష్టం చేశారు. 

చదవండి : అనంతపురం: నలుగురు వైద్య సిబ్బందికి కరోనా!

మరిన్ని వార్తలు