కేంద్రంపై నమ్మకం ఉంది

10 Sep, 2017 03:00 IST|Sakshi
కేంద్రంపై నమ్మకం ఉంది

► అభివృద్ధి పనులకు జీఎస్టీ తగ్గింపుపై మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న పనులకు జీఎస్టీ అమలులో న్యాయం చేస్తారని తమకు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, ప్రజాసంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధి పనులపై అదనపు భారం వేయ వద్దన్న సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తిపై కౌన్సిల్‌ సమా వేశంలో చర్చించామని, వచ్చే సమావేశంలో దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రానైట్, బీడీ పరిశ్రమ లపై పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని, ఫిట్‌మెంట్‌ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా రన్నారు.

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేం దుకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి జీఎస్టీ విషయంలో వినతులు వెల్లువలా వచ్చాయి. సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ నేతృ త్వంలోని వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం, గ్రానై ట్‌ వ్యాపారులు, హోటల్స్‌ అసోసియేషన్, టెక్స్‌ౖ టెల్, పౌల్ట్రీ అసోసియేషన్ల ప్రతినిధులు తమ వ్యాపారాలపై జీఎస్టీ తగ్గించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. వీటన్నింటినీ ఫిట్‌మెంట్‌ కమిటీకి పంపించి తగిన నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కాగా, జీఎస్టీ తదుపరి కౌన్సి ల్‌ సమావేశం అక్టోబర్‌ 24న ఢిల్లీలో నిర్వహిస్తారు.

కౌన్సిల్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు..
→ ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు లేదా గవర్న మెంట్‌ అథారిటీలకు నిర్మాణం రూపంలో అందిం చిన సేవలు, మరమ్మతు, నిర్వహణ, నవీకరణలకు జీఎస్టీని 12 శాతం విధిస్తారు.
→అంతర్జాతీయ వినియోగదారులకు యాంట్రిక్స్‌ సరఫరా చేసే ఉపగ్రహ ప్రయోగ సేవల ప్రాంతాన్ని ఐజీఎస్టీ చట్టం, 2017 లోని సెక్షన్‌ 13 (9) ప్రకారం భారతదేశానికి బయటి ప్రాంతంగా పరిగణిస్తారు. అలాంటి సరఫరా సేవలకు ఐజీఎస్టీ నుంచి మినహాయిస్తారు.   
 

>
మరిన్ని వార్తలు