చీకటిపూట.. నీటివేట

13 May, 2018 07:35 IST|Sakshi
చెక్‌డ్యాం పనులను పరిశీస్తున్న మంత్రి ఈటల

 మానేరువాగును పరిశీలించిన మంత్రి ఈటల

 వాగులో అరకిలోమీటర్‌ నడక

 జమ్మికుంటకు నీళ్లందించాలని అధికారులకు ఆదేశం

 ముత్తారం చెరువు నీళ్లు మళ్లించాలని సూచన

జమ్మికుంట(హుజూరాబాద్‌): జమ్మికుంట పురపాలక పరిధిలో 23రోజులుగా తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. మానేరు ఏడారిగా మారింది. నీటిసరఫరాకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలిసిన మంత్రి ఈటల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. జమ్మికుంటకు నీటిసరఫరా చేస్తున్న పైప్‌లైన్‌ను శనివారం సాయంత్రం పరిశీలించారు.

ముత్తారం టు మానేరు..
శంకరపట్నం మండలం ముత్తారం చెరువులో నీటిని కల్వల ప్రాజెక్ట్‌లోకి మళ్లించి, అక్కడి నుంచి వీణవంక, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, కల్లుపల్లి వాగు నుంచి మానేరులోని చెక్‌డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం నీళ్లు శివారుకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ విలాసాగర్‌లోని మానేరు వాగును సందర్శించారు.  

కాలినడకన..
నీరు చేరుకున్న చోటికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో మంత్రి ఈటల కాలినడకన వెళ్లా రు. మానేరు సంప్‌హౌస్‌లోకి నీరు నింపేలా చర్య తీసుకోవాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈకి ఫోన్‌లో సూచించారు. ముత్తారం చెరువు నుంచి కల్వల ప్రాజెక్ట్‌ లోకి మరింత నీరు వదలాలని ఆదేశించారు. ఆదివారం వరకు వాగులో నీటిప్రవాహవేగం పెరిగేలా చూడాలని తెలిపారు.అనంతరం జమ్మికుంటకు సరఫరా అయ్యే మంచినీటి బావులను పరిశీలించారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేలా చూడాలని మున్సిపాల్‌ చైర్మన్‌ పొడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పింగిళి రమేష్, పురపాలక కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌ను అదేశించారు.

పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలి
జమ్మికుంటరూరల్‌: వేసవి కాలం పూర్తయ్యే నాటికి చెక్‌డ్యాం పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను, గుత్తేదారును ఆదేశించారు. శనివారం మండలంలోని విలాసాగర్‌ మానేరు వా గుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించా రు. పదిహేను రోజుల్లో చెక్‌డ్యాం పనులు పూర్తయితే రబీలో రైతుల పంటలకు నీటికి కొదవ ఉండదని తెలిపారు.  

 

>
మరిన్ని వార్తలు