రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సాహం

21 Nov, 2018 13:47 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి  

సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు రాజకీయంగా ఎదగడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని  మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలాల్లోని కేసారం, నారాయణగూడెం, కాసరబాద గ్రామాలకు చెందిన వివిధపార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. గత పాలకుల వల్ల కానీ విధంగా యాదవులను గుర్తించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మొండికత్తి వెంకటేశ్వర్లు, సంకరమద్ది రమణారెడ్డి, సైదులు, మండలి కృష్ణ, అచ్చాలు పాల్గొన్నారు.  
అభివృద్ధే.. మంత్రిని గెలిపిస్తుంది
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తాయని మంత్రి సతీమణి గుంటకండ్ల సునీతజగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళికతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు.  కార్యక్రమంలో కౌన్సిలర్‌ గండూరి పావని, వూర గాయత్రి, సల్మా, రాచూరి రమణ, కరుణ, శనగాని అంజమ్మ, అన్నపూర్‌న, వెంకటమ్మ పాల్గొన్నారు. 
విజయాంజనేయస్వామి ఆలయంలో పూజలు
మంత్రి జగదీశ్‌రెడ్డిభారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ 7వ వార్డులో విజయాంజనేయస్వామి దేవాలయంలో ఆ వార్డు అధ్యక్షుడు కొండపెల్లి దిలీప్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణ, దాసరికిరణ్, మాధవి, చంద్రకళ, సైదులు, వెంకటేష్‌  పాల్గొన్నారు.
భారీ మెజారిటీతో గెలవడం ఖాయం..
మంత్రి జగదీశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ 8వ వార్డులో కౌన్సిలర్‌ నిమ్మల వెంకన్న ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆయన వెంట రామకృష్ణ, సతీష్, సత్యనారాయణ, సత్యం, వెంకటేష్, రాజేష్‌ తదితరులు ఉన్నారు.  
కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక
సూర్యాపేటరూరల్‌ :    మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో  అలకుంట్ల లింగయ్య, శివరాత్రి యాదగిరి, రూపాని పెద్ద మల్లయ్య, సతీష్, నర్సింహా, గుర్రం వెంకటేశ్వర్లు, వెంకటేశ్, శేఖర్‌తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్, వంగాల శ్రీనువాస్‌రెడ్డి, రామసాని శ్రీనువాస్‌నాయుడు, మామిడి తిరుమల్, నరేష్, మోతీలాల్, తదితరులు పాల్గొన్నారు.  
చివ్వెంల : టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారంగుంపుల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నెమ్మాది భిక్షం, ఊట్కూరి సైదులు, నారాయణ రెడ్డి పగడాల లింగయ్య, ఎసోబ్, నాతాల శేఖర్‌రెడ్డి, కోలా శ్రీనివాస్, నాగయ్య, వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌ రెడ్డి మధు పాల్గొన్నారు.  
ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి
పెన్‌పహాడ్‌ : ఈ నెల 23న సూర్యాపేటలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం అనంతారం క్రాస్‌ రోడ్డు వద్ద విలేకర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య పద్మ, జెడ్పీటీసీ పిన్నెని కోటేశ్వర్‌రావు, నర్సింహ్మరెడ్డి, వెంకటేశ్వర్లు, భిక్షం, ఇంద్రసేనారావు, సీతారాంరెడ్డి,  వెంకటరెడ్డి,  కృష్ణ,  శ్రీనివాస్, కర్ణాకర్‌రెడ్డి  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు