లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి

12 Oct, 2019 02:42 IST|Sakshi

నిర్వహణ లోపంతో మొరాయించిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని లిఫ్ట్‌

పగలకొట్టి మంత్రిని బయటకు తెచ్చిన సిబ్బంది

హిమాయత్‌నగర్‌: ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మించి పట్టుమని 6 నెలలు కూడా గడవకముందే అప్పుడే సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రే లిఫ్ట్‌లో అరగంట పాటు ఇరుక్కుపోయారు. ఈ ఘటన శుక్రవారం హైదర్‌గూడలోని ‘ఎంఎస్‌–3’(ఎమ్మెల్యే క్వార్టర్స్‌)లో చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 8వ అంతస్థులోని 810 ఫ్లాట్‌ (క్వార్టర్‌)లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ల ప్రాంతంలో తన అనుచరులు, వ్యక్తిగత సిబ్బందితో కలసి రేషన్‌ డీలర్ల సమావేశానికి హాజరయ్యేందుకు ఫ్లాట్‌ నుంచి బయలుదేరారు. లిఫ్ట్‌లోకి వెళ్లిన తర్వాత కిందకి వెళ్లే బటన్‌ నొక్కడంతో లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోయాయి. లిఫ్ట్‌ ఎటూ కదలకపోవడం, డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో ఆందోళన చెందిన మంత్రి సిబ్బంది క్వార్టర్స్‌ నిర్వహణాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని అరగంట పాటు నానా శ్రమ పడి గడ్డపార, స్కూ డ్రైవర్‌ ఉపయోగించి డోర్లు తెరిచారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే క్వార్టర్స్‌ అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పరిమితికి మించిన బరువు వల్లే లిఫ్ట్‌ నిలిచిపోయిందని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ సెక్షన్‌ అధికారి సునీల్‌ తెలిపారు. మంత్రితోపాటు ఆయన అనుచరులు, సిబ్బంది మొత్తం 13 మంది వరకు ఆ సమయంలో లిఫ్ట్‌ ఎక్కడం వల్ల ఇలా జరిగిందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా