సిద్ధిపేటను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దుదాం..

23 Sep, 2019 15:34 IST|Sakshi

ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు

సాక్షి, సిద్ధిపేట: గాంధీ మహాత్ముడు ప్రవచించిన స్వచ్ఛతను ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సం‍దర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛతపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే విధంగా ర్యాలీ నిర్వహించడం హర్షణీయం అన్నారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల చాలా అనర్థాలకు గురవుతున్నామని, సిద్ధిపేటను ప్లాస్టిక్‌ రహిత సిటీగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

బతుకమ్మ చీరలు పంపిణీ..
బతుకమ్మ,దసరా పండగలను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీరలు ఇస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ పరిషత్‌లో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సిద్ధిపేట ప్లాస్టిక్‌ రహితంగా మారాలన్నారు. ప్రతిఒక్కరూ తడి,పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు పూర్తి కాగానే కొత్త రోడ్లు వేస్తామని చెప్పారు. ప్లాసిక్‌ వస్తువులు ఇళ్లలో వాడకూడదన్నారు. మాంసం, చికెన్‌ దుకాణాలకు స్టీల్‌ డబ్బాలు  తీసుకెళ్లాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అవసరమని తెలిపారు. ఇంటింటికి నల్లా మాదిరి.. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు పైపులు ద్వారా త్వరలో సరఫరా చేస్తామన్నారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో మొక్కలు విధిగా పెంచాలని సూచించారు.

అధికారులపై మంత్రి ఆగ్రహం...
సిద్ధిపేట పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఛైర్మన్‌, పురపాలక అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా