'అందరూ చిరునవ్వుతో ఉండాలనేదే లక్ష్యం'

18 Sep, 2017 14:08 IST|Sakshi
'అందరూ చిరునవ్వుతో ఉండాలనేదే లక్ష్యం'
సాక్షి, సిద్ధిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సోమవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ భూదేవి గార్డెన్స్ వేదికైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరయ్యారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని.. కొత్త దుస్తులు లేకుండా ఉండకూడదు. అంతా చిరునవ్వులతో ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో బతకాలని, ప్రభుత్వం తరపున కుల, మతాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ పండుగలు అధికారికంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున క్రిస్టియన్స్ కొత్త బట్టలు పంపిణీ చేశామని, అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టిందని చెప్పారు.
 
ఇవాళ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిలో నమ్మకం, విశ్వాసాన్ని కల్పిస్తున్నామన్నారు. విద్య, వైద్యంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా చేనేత బతకాలి.. అక్కా చెల్లెళ్ళకు చీరలు అందించాలనే సీఎం కేసీఆర్ సమాలోచన చేశారని చెప్పారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వడంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరపున చీరలు పంపిణీ చేయాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి లేక ఆకలితో సతమతం అవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు. రాష్ట్రంలోని ప్రతి మహిళా పండుగకు కొత్త దుస్తులు కట్టుకోవాలని బతుకమ్మ చీరలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
 
తెలంగాణకు అవసరమైన కోటి చీరలు చేనేత కార్మికులు అందించలేకపోవడంతో.. సూరత్ నుంచి 50 లక్షల చీరలు తెప్పించామని., వచ్చే యేటా నుంచి నేత కార్మికుల వేసిన చీరలను సేకరిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం కేసీఆర్ కిట్, సిద్ధిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు, పట్టణ పారిశుధ్యం, హరిత హారం, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండాలనే విషయం గురించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ.. పలు అంశాలపై మహిళల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. 
మరిన్ని వార్తలు