కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

21 Mar, 2020 13:12 IST|Sakshi

కరోనాపై దేవాదాయ శాఖ అప్రమత్తం

దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ చైనా నుంచి 180 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటిష్ట చర్యలకు ఆదేశించారని తెలిపారు. ఇతర దేశాల  నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్‌ కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాల్లో రద్దీ తక్కువ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. నిన్నటి  నుంచి అన్ని ఆలయాల్లో భక్తులకు అనుమతులు నిలిపివేశామన్నారు.
(కరోనా అలర్ట్‌: 271కి చేరిన బాధితుల సంఖ్య)

దేవాదాయ శాఖ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
ప్రతి ఏటా ఉగాది పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో జరిగేందని.. కానీ ఈ ఏడాది దేవాదాయ శాఖ కార్యాలయంలో జరుగుతుందన్నారు. లైవ్‌ ద్వారా మాత్రమే భక్తులు పంచాంగ శ్రవణం వినాలని సూచించారు. కరోనా కట్టడికి చర్యల్లో భాగంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఆడంబరాలు లేకుండా జరిపేవిధంగా  ఆదేశాలిచ్చామని తెలిపారు. తక్కువ మంది మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతారని పేర్కొన్నారు.
(‘దగ్గు, గొంతు నొప్పి.. ఆ తర్వాత కరోనా’)

>
మరిన్ని వార్తలు