స్వాతంత్య్ర సమరయోధుడికి కన్నీటి వీడ్కోలు..

29 Jan, 2020 09:58 IST|Sakshi
నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య

సాక్షి, మిర్యాలగూడ: స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తిరునగరు గంగాధర్‌కు ఆయన బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన 15 రోజులుగా సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ నుంచి పట్టణంలోని షాబునగర్‌లో ఉన్న తన నివాసానికి పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. గంగాధర్‌ మృతితో మిర్యాలగూడలో విషాద చాయలు అలుముకున్నాయి. కడసారిగా చూసేందుకు పట్టణ ప్రజలు భా రీగా తరలివచ్చారు. ప్రజానాయకుడు అయిన గంగాధర్‌ మృతితో పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. 


గంగాధర్‌ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు

గంగాధర్‌ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు.. 
రాజకీయ కురువృద్ధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరునగరు గంగాధర్‌ మృతి విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడ, కోదాడ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, వేనేపల్లి చందర్‌రావు అక్కడకు చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. గంగాధర్‌ కుమారుడు, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌తోపాటు గంగాధర్‌ భార్య కన్నీటి పర్వతం కా వడంతో మంత్రి స్వయంగా దగ్గరకు వెళ్లి కు టుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారని, సైనికుడిగా దే శానికి సేవలను అందించారని అన్నారు. గంగా ధర్‌ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 

               గంగాధర్‌ సతీమణిని ఓదార్చుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి 

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో..
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తిరునగరు గంగాధర్‌ పార్థివదేహాన్ని సందర్శనకుగాను కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గంట సేపు ఉంచారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు గంగాధర్‌ను కడసారిగా చూసేందుకు తరలివచ్చారు. అనంతరం పట్టణ సమీపంలోని వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెంలో తన వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు. కాగా అంతిమయాత్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ భూమి వరకు సాగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అంతమయాత్రలో పాల్గొన్నారు. గంగాధర్‌ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మిర్యాలగూడ జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీని వాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు చీమ వెంకన్న, సత్యబాబు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు పి. సుబ్బారావు, పీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నా యక్, వివిధ పార్టీల నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, వస్కుల మ ట్టయ్య, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కర్నాటి రమేష్, చిట్టిబాబు నాయక్, స్కైలాబ్‌నాయక్, తాళ్లపల్లి రవిలతో పాటు వివిధ రా జకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్ర జాప్రతినిధులు, అధికారులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు