రాత్రికి రాత్రే కరెంట్ తేలేం

10 Oct, 2014 00:15 IST|Sakshi

మంత్రి జగదీష్‌రెడ్డి

కోదాడ: అరవై ఏళ్ల ఆంధ్రా పాలకుల అసమర్ధపాలనే నేడు తెలంగాణలో కరెంట్ సమస్యకు కారణమని విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ వస్తువు లాగా రాత్రికి రాత్రే కరెంట్‌ను కొనుక్కురాలేమని చెప్పారు. 

ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకురాకుం డా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కరెంటులైన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల వేశాడన్నారు.  మహారాష్ట్ర నుంచి యూనిట్‌కు రూ.8 నుంచి 10 వరకు ఖర్చు చేసైనా కోనుగోలు చేసి వ్యవసాయానికి అందిస్తు న్నామని చెప్పారు. పంటలెండిపోకుండా  చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు