నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన విఠల్‌

22 Jan, 2020 02:22 IST|Sakshi
మంగళవారం ఏపీ విఠల్‌ భౌతికకాయం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, తదితరులు

ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు) : నమ్మిన సిద్ధాం తం... ఆశయానికి జీవితంలో చివరి క్షణం వరకు కట్టుబడిన మహావ్యక్తి డాక్టర్‌ ఏపీ విఠల్‌ అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడ పటమటలోని భద్రయ్యనగర్‌లో విఠల్‌ పార్దివదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సూర్యాపేటలో పేదలకు పైసా ఆశించకుండా వైద్యం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉందంటూ అనేక వ్యాసాలు రాశారన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థం కలిగిన వ్యక్తి విఠల్‌ అని అన్నారు. ఆయన మృతి ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటు అని ఆయన అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి,  ౖజానపద కళాకారుడు గోరటి వెంకన్న తదితరులు విఠల్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కాగా విఠల్‌ మృతదేహాన్ని గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలకు అప్పగించినట్లు ఆయన కుమార్తె సుహాసిని తెలిపారు. 

సీఎం జగన్‌ సంతాపం
ఏపీ విఠల్‌ మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

మరిన్ని వార్తలు