కోర్టుకు హాజరయిన మంత్రి రామన్న

20 Feb, 2018 15:31 IST|Sakshi
కోర్టుకు వస్తున్న రామన్న, బాలకిషన్, అరవిందరెడ్డి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్‌ నేత అరవిందరెడ్డి సోమవారం హాజరయ్యారు. 2012లో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికల కోడ్‌ ఉల్లంగించారని అప్పటి ఎన్నికల అధికారి గుగ్లోత్‌ రవినాయక్‌ కేసు నమోదు చేశారు.

కేసుకు సంబంధించి ముగ్గురు కోర్టుకు హాజరుకాగా ఏప్రిల్‌ 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. దీంతోపాటు 2010లో ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించారని వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ నేత సంజీవ్‌రెడ్డి పరువు నష్ట దావా కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా జోగు రామన్న కోర్టుకు హాజరు కాగా, ఈ నెల 27కు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు