మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీ

11 Aug, 2018 13:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన మెగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం ఆకస్మికంగా తనీఖీ చేశారు. మంత్రి కేటీఆర్‌తోపాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి పనులను పరిశీలించారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో పెద్ద ఎత్తున ఒకేచోట 15,600 డ‌బుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. రామ‌చంద్రాపురంలోని కొల్లూరు గ్రామంలో చిన్నపాటి సిటీని తలపించేరీతిలో ఈ మెగా డ‌బుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ఇళ్లను నిరుపేద ల‌బ్ధిదారులకు ఉచితంగా అందజేయనున్నారు. కొల్లూరులో 124 ఎక‌రాల స్థలంలో రూ. 1354.59 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. దేశంలోనే ఆద‌ర్శవంత‌ంగా, మ‌రెక్కడా లేనివిధంగా అన్ని సౌక‌ర్యాల‌తో ఈ కాలనీని మోడ‌ల్ సిటీగా నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు