ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌

17 Oct, 2019 12:17 IST|Sakshi
బయో ఏసియా సదస్సు థీమ్‌ను ఆవిష్కరిస్తున్న కేటీఆర్, జయేష్‌ రంజన్‌

మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ‘17వ బయో ఏసియా సదస్సు’ వెబ్‌సైట్, థీమ్‌లను బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో కేటీఆర్‌ ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 17వ బయో ఏసియా సదస్సును ‘టుడే ఫర్‌ టుమారో’నినాదంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు రాజధానిగా మారుస్తామని చెప్పారు.

టీఎస్‌ఐఐసీ, రిచ్, స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ వంటి పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పలు కేంద్ర సంస్థలు కూడా ఈ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు తెలిపారు. బయో ఏషియా సమావేశానికి స్విట్జర్లాండ్‌ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉంటుందన్నారు. అసోం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ‘రాష్ట్ర భాగస్వాములు’ హోదాలో ఈ సమావేశానికి హాజరవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు