కరోనా నియంత్రణపై మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

17 Apr, 2020 17:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని.. వారికి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులు, మెడిసిన్స్‌ ఇళ్లకే సరఫరా చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న కుటుంబాల సెల్‌ నెంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి అవసరాలు తెలుసుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. శానిటేషన్‌, స్ప్రేయింగ్‌, ఫీవర్‌ సర్వేలను తగ్గు జాగ్రత్తలతో నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు