టెన్త్‌ టాపర్లతో మంత్రి సహపంక్తి భోజనం

3 Jun, 2019 06:53 IST|Sakshi
విద్యార్థులతో భోజనం చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, పక్కన కలెక్టర్‌ శరత్‌

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో పది గ్రేడ్‌పాయింట్లు సాధించిన 62 మంది విద్యార్థులతో కలసి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం సహపంక్తి భోజనం చేశారు. పది ఫలితాల్లో జిల్లాను వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిపినందుకు కలెక్టర్‌ శరత్‌ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌తోపాటు విద్యాధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే నూరుశాతం ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాలో 15వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం 35 మంది మాత్రమే ఫెయిల్‌ అయ్యారన్నారు. ‘ఉత్తేజం’కార్యక్రమానికి దాతలు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్, కలెక్టర్‌ శరత్, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

మరిన్ని వార్తలు