జూరాల నీటిని విడుదల చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి 

13 Jul, 2020 01:47 IST|Sakshi
సాగునీటిని విడుదల చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

ధరూరు(గద్వాల): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితతో కలసి జూరా ల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ల ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్‌ లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి రైతులకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. వానాకాలం పంట కింద జూరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరందిస్తామని, చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు