తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలి..

12 Dec, 2019 15:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విత్తనాలకు సంబంధించిన బ్రాండ్ లోగోను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వపరంగా నాణ్యమైన వితనోత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని రకాల సానుకూలంగా ఉన్న తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ ఉత్పత్తి చేసే విత్తనాలకు మంచి డిమాండ్ ఉందని, అంతేకాక ఇతర దేశాలకు విత్తనాల ఎగుమతిని పెంచడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు. తాను కేవలం మంత్రి మాత్రమే కాదని.. ఒక విత్తన రైతు కూడా అని సమావేశంలో చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్గ్రంలో విత్తనాల ఉత్పత్తికి అవసరమైన అన్నిరకాల సానుకూలతలు ఉన్న కారణంగానే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకెళ్లి ప్రపంచానికి రాష్ట్రం పేరు తెలిసేలా చేయాలన్నారు. క్రాప్ కాలనీలతో వ్యవసాయాన్ని బలోపేతం, అభివృద్ధి చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

మొక్కజొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమలో మొక్కజొన్న వినియోగం ప్రధానమైనదని తెలిపారు.  అదేవిధంగా మసాల దినుసులకు సంబంధించిన విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్‌లో పదకొండు సెంటర్లు పెట్టి ఉల్లి అమ్ముతున్నామని, రైతులకు ఉల్లి వితనోత్పత్తిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు