గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

9 Apr, 2016 02:14 IST|Sakshi
గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రామన్న

 
ఆదిలాబాద్ రూరల్ : గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఏళ్ల కిందట నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవనాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నూతన భవనాల నిర్మాణం కోసం శుక్రవారం  మండలంలోని బట్టిసావర్‌గాం గ్రామ పంచాయతీకి వచ్చిన మంత్రి ఉగాది పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 161 నూతన గ్రామ పంచాయతీ భవనలు నిర్మించ నున్నామాని, ఇందులో ఆదిలాబాద్ మండలంలో 8 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరైన్నట్లు మంత్రి తెలిపారు.

వీటిని రూ. 13లక్షల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పేద ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉగాది పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ  సభ్యులు మంత్రి రామన్నను సన్మానించారు.

కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, గ్రామ పంచాయతీ సర్పంచ్ రామారావు, ఉప సర్పంచ్ ఏదుల్లా స్వామి, బట్టిసావర్‌గాం ఎంపీటీసీలు మెస్రం సంగీత, పవన్ కుమార్, తహ సీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రవిందర్, టీఆర్‌ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, మండల అధ్యక్షుడు రాజన్న, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు గణపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు