వాటికి నిధుల కొరత లేదు : మంత్రి పోచారం

28 Apr, 2018 19:11 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : ఇంటింటింకి నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనని ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథకు నిధుల కొరత ఏమాత్రం లేదని, తగినన్ని నిధులు ఉన్నాయని మంత్రి తెలిపారు. మిషన్‌ భగరథ పూర్తి అ‍య్యే వరకు ఎ‍క్కడ అలసత్వం వహించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. రాత్రి పగలు కష్టపడి చెప్పిన గడువులోగా ఎట్టి పరిస్థితుల్లో నీరు అందించాలని ఆదేశించారు. మే 10 నాటికి బల్క్‌ వాటర్‌ ప్రతి గ్రామానికి నీరు చేరాలని, జూన్‌ 30 నాటికి ప్రతి ఇంటికి 100శాతం నల్లాల ద్వారా తాగునీరు సరఫరా అయ్యేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు