మంత్రి పర్యటన: అధికారులపై వేటు

12 Apr, 2018 11:57 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం గుర్జకుంటలో గురువారం ‘రైతుబంధు’  పథకం పంపిణీ నమూనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి , విప్ గంప గోవర్దన్, కలెక్టర్‌ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు రెండు పంటలకు సాగునీళ్లిస్తామని తెలిపారు. మంత్రి లేదా ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు బంధు పథకానికి రూ.6 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.

అధికారులపై వేటు
జిల్లాలో ఇద్దరు ప్రభుత్వాధికారులపై వేటు పడింది. బిక్నూర్‌ మండలం ఆర్‌ఐ, వీఆర్‌వోలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. మంత్రి పోచారం జిల్లా పర్యటన సందర్భంగా.. సదరు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్టు సమాచారం. దీంతో వారిని సస్పెండ్‌ చేస్తూ తహసీల్దార్‌కు ఛార్జ్‌ మెమో జారీ చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

మరిన్ని వార్తలు