మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఘన స్వాగతం

11 Sep, 2019 11:34 IST|Sakshi
వరద కాలువ జీరోపాయింట్‌ వద్ద కాళేశ్వరం నీళ్లకు పూజలు చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

‘కాళేశ్వరం’ జలాలకు వందనం

సాక్షి, నిజామాబాద్‌: వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చెంతకు చేరిన కాళేశ్వరం జలాలకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పూజలు చేశారు. కాళేశ్వరం పథకం రూపకల్పనలో తానుకూడా భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమని, ఇది ఈ జన్మకు చాలంటూ మంత్రి భావోద్వేగంతో మట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం నీరు ఎస్సారెస్పీకి చెంతకు చేరాయి. దీంతో పూజలు చేసేందుకు మంగళవారం విచ్చేసిన రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

రైతులు, అధికారులు, టీఎన్జీవోస్‌ నాయకులు ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ముప్కాల్, మెండోరా ఎంపీపీలు సామ పద్మ, బురుకల సుకన్య, జెడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వనర్సారెడ్డి, తలారి గంగాధర్, పార్టీ బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు దాసరి వెంకటేశ్, సామవెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్, ఎస్సారెస్పీ అధ్యక్షుడు జాన్‌సుభాకర్‌ తదితరులులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా