మాస్క్‌లు ధరించకుంటే టికెట్‌ ఇవ్వొద్దు

20 May, 2020 15:50 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకుంటే టికెట్‌ ఇవ్వొద్దని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రోజున ఖమ్మం బస్టాండ్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌ చేసిన తర్వాతే టికెట్‌ ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు. అనంతరం.. కోదాడు బస్సు డిపోను సైతం మంత్రి పరిశీలించారు. ప్రయాణికులకు స్వయంగా శానిటైజర్‌ స్ప్రే చేశారు. చదవండి: ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని ప్రతి బస్సుకు విధిగా శానిటైజర్‌ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ ఆర్‌ వి కర్ణన్‌, మేయర్‌ పాపాలాల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ఆర్‌టీసీ అధికారులు ఉన్నారు. చదవండి: ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా

మరిన్ని వార్తలు