బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్‌’

12 Sep, 2019 02:56 IST|Sakshi

విద్యార్థుల సక్సెస్‌ స్టోరీలు, టీచర్ల సలహాలు, సూచనలకు చోటు

ఈ–మ్యాగజైన్‌ ‘ఎడ్యుషూర్‌’ను ప్రారంభించిన విద్యామంత్రి సబిత

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్తగా ఈ–మ్యాగజైన్‌ (ఎడ్యుషూర్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పత్రికలో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశ బోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు సూచనలు ఇందులో ప్రస్తావిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ మ్యాగజైన్‌ ఉపయోగపడనుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ఎడిషన్‌ను ప్రదర్శిస్తారు. వీటిలోని అంశాలను విద్యార్థులకు బోధిస్తారు. ఈ మ్యాగజైన్‌ను మంత్రి పి.సబితారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం లో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వీరందరూ ఈ– మ్యాగజైన్‌ను చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా