కంటైన్‌మెంట్ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు

22 May, 2020 16:23 IST|Sakshi

పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాలతోనే పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శకాలను పాటిస్తూ జూన్‌ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు జరపనున్నామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అదనంగా మరో 2,005 పరీక్షా కేంద్రాలను పెంచామని పేర్కొన్నారు.
(పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల)

తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గంట ముందుగా వచ్చినా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులకు మాస్క్‌లు ఇస్తామని పేర్కొన్నారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సెంటర్ల వివరాలు, సహాయం కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు