త్వరలో ‘పాలమూరుకు’ సీఎం

19 Aug, 2019 08:26 IST|Sakshi
కిషన్‌నగర్‌లో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం  

సర్వాయి పాపన్నగౌడ్‌ అందరి వాడు 

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, షాద్‌నగర్‌: బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం బహుజన విప్లవకారుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ఎంతో పోరాటం చేశారని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆయన జయంతి వేడుకలను పురస్కరించుకొని ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కిషన్‌నగర్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ... పూర్వకాలంలో మొఘల్‌రాజులు, చక్రవర్తులు ప్రజలతో వెట్టిచాకిరీ చేయించుకునే వారన్నారు. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సర్దార్‌ సర్వాయి పాపన్న పోరాటం చేశారని తెలి పారు. ఢిల్లీ రాజులను మొదలుకొని గోల్క ండను పాలించిన రాజులను సర్వాయి పాపన్నగౌడ్‌ ఎదిరించారని కొనిడారు.

తాగునీటి సమస్యకు పరిష్కారం 
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు శివారులో నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు. ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి షాద్‌నగర్‌ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించేందుకు త్వరలో సీఎం కేసీఆర్‌ విచ్చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా తీరుస్తామని అన్నారు.

ఈత చెట్లను విధిగా నాటాలి 
గౌడ కులస్తులు విధిగా ఈతచెట్లను నాటాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈట చెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో, చెరువు కట్టలపై, కాల్వల పక్కన, ఖాళీ స్థలాల్లో ఈత చెట్లను నాటాలన్నారు.   ఈతచెట్లకు కట్టే పన్నును కూడా పన్నును రద్దు చేసిందని తెలిపారు. స్వచ్ఛమైన కల్లు తాగితే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్‌ పట్టణం చౌరస్తాలో సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటానికి, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గౌడ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌ అహ్మద్, నాయకులు అందెబాబయ్య, కొందూటి నరేందర్, అగ్గునూరు విశ్వం, దేవిహన్య నాయక్, బుద్దుల శ్రీశైలం, గౌడ్‌ సంఘం నాయకులు రంగయ్యగౌడ్, గోవర్ధన్‌గౌడ్, మద్దూరి అశోక్‌గౌడ్, వన్నాడ ప్రకాష్‌గౌడ్, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, రాములు గౌడ్, దేపల్లి అశోక్‌గౌడ్, శివశంకర్‌గౌడ్, శివరాములుగౌడ్, కట్టా వెంకటేష్‌గౌడ్, కుమార్‌గౌడ్, విజయ్‌గౌడ్, శ్రీనివాస్, శ్రీకాంత్‌గౌడ్, భానుచందర్‌గౌడ్, విజయ్‌గౌడ్, అభిలాష్‌గౌడ్, శ్రావణ్, అభి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రత్యేక  చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వివరించారు. అదేవిధంగా వ్యవయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎంకేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో రైతు భీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్, రుణమాఫీ తదితర పథకాలను చేపట్టినట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు