రండి.. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి!

22 Feb, 2018 02:23 IST|Sakshi

దుబాయ్‌లోని వివిధ సంస్థలకు మంత్రి తలసాని ఆహ్వానం  

సర్కార్‌ చర్యలను పరిశీలించాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించాలని కోరారు. దుబాయ్‌లో జరుగుతున్న గల్‌ఫుడ్‌ – 2018 ట్రేడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. రెండోరోజు బుధవారం ట్రేడ్‌షోలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్‌విండో విధానంలో ఇచ్చేందుకు టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా, నీటి లభ్యత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం అనేక రాయితీలను కూడా కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాంసం ఉత్పత్తి రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని మంత్రి వెల్లడించారు. మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రం మాంసం ఎగుమతి చేసేస్థాయికి ఎదగాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశామని, వీటి ద్వారా రాబోయే రోజుల్లో మాంసం ఎగుమతి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించి మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు గత సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామని వివరించారు. ట్రేడ్‌షోలో మంత్రితోపాటు డెయిరీ డెవలప్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్మల, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

హంగులకే కోట్లు ఇస్తున్నారు

‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’

ఇంటికి చేరిన ‘టింగు’

మరింత ప్రియం కానున్న మద్యం

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కేటీఆర్‌ స్ఫూర్తితో..

ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా

కమలాకర్‌ వర్సెస్‌ కమలాసన్‌

రాబందును చూపిస్తే లక్ష నజరానా

రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి

ఇండియాకు వస్తాననుకోలేదు 

వదల బొమ్మాళీ!

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తే జైలుకే!

‘వసూల్‌ రాజా’పై సీపీ సీరియస్‌

లబ్ధిదారులతో స్పీకర్‌ వీడియో కాల్‌ 

పోతరాజుల పోసాని

కామారెడ్డిలో పట్టపగలే భారీ చోరీ

క్షణాల్లో గుట్కా మాయం

వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య

‘బిల్ట్‌’ భూముల అమ్మకంపై ఆగ్రహం

కోల్డ్‌ స్టోరేజ్‌లో  అగ్ని ప్రమాదం

మందు బాబులకు వాట్సాప్‌ సాయం!

కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు

మ‘రుణ’ శాసనం

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు

కళ్లు చెబుతాయ్‌.. చేతివేళ్లు రాస్తాయ్‌

విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తే మీరెందుకు..?

తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!