పకడ్బందీగా గొర్రెలు, పాడి గేదెల పంపిణీ: తలసాని

10 Aug, 2018 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విభిన్న కార్యక్రమాల అమలుతో దేశంలోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో రెండో విడత గొర్రెలు, పాడి గేదెల పంపిణీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలపై జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆలోచనతో రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని, సమిష్టి కృషితో 63 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని యాదవ, కురుమలందరికీ గొర్రెలు పంపిణీ చేసేందుకు మరో రూ.5 వేల కోట్లు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు