నగరాల రూపురేఖలు మార్చేస్తున్నాం

24 Jan, 2017 04:11 IST|Sakshi
నగరాల రూపురేఖలు మార్చేస్తున్నాం

జియో స్పేషియల్‌ వరల్డ్‌ ఫోరమ్‌ సదస్సులో వెంకయ్యనాయుడు
 భవిష్యత్తుకు స్పేషియల్‌ టెక్నాలజీలే దన్ను
నిర్మాణ అనుమతుల జారీ సరళతరం
జియో ట్యాగింగ్‌తో వృథాకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్య  


సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ నేతృత్వం లో దేశంలోని నగర ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నా యని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌ మొద లుకొని ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, అమృత్‌ వంటి అనేక పథకాలు నగర ప్రాంతా ల రూపురేఖలను మార్చేస్తున్నా యన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జియోస్పేషియ ల్‌ వరల్డ్‌ ఫోరమ్‌ అంతర్జా తీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రతి నగరం స్మార్ట్‌ సిటీగా మారేందుకు పోటీపడుతోం దని.. పట్టణ, నగర ప్రాంతాల్లో తిష్టవేసిన అనేక సమస్యలకు జియోస్పేషియల్‌ టెక్నాల జీలు వేగంగా పరిష్కారం చూపగలవని ఆయన చెప్పారు. ఈ రంగంలో దేశానికి రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు.

ఉద్యోగులకు జియోట్యాగింగ్‌..
మున్సిపాలిటీలు తమ ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు గమనించేందుకు జియో ట్యాగింగ్‌ టెక్నాలజీని ఉపయోగించాలని, తద్వారా సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్రం స్పాట్‌ యువర్‌ టాయిలెట్‌ పేరుతో ఓ యాప్‌ను అందుబాటు లోకి తేనుందని, దాని ద్వారా నగర ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఎక్కడెక్కడ అందు బాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపా రు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించే ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేస్తున్నామని, తద్వారా ఇంటి నిర్మాణం నిజంగా జరిగిందీ లేనిదీ స్పష్టమవుతుందని చెప్పారు. మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ద్వారా కొత్త ఇళ్ల ఫొటోలను భువన్‌ సర్వర్‌తో అనుసం ధానించామని, తద్వారా ఎక్కడ ఏ ఇల్లు ఉందో స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నా రు. నగరాల్లో భవన నిర్మాణాలు, ఇతర పనులకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు పౌర విమానయాన, రైల్వే, పర్యావరణ తదితర ఏడు శాఖలతో సంప్రదింపులు జరిపి ఏకీకృత విధానాన్ని తీసుకువస్తున్నామని వెంకయ్య వెల్లడించారు. నగరాల మ్యాపుల్లోనే నిర్మాణానికి అనుమ తుల అవసరం లేని ప్రాంతాలను స్పష్టంగా గుర్తిస్తామని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని నిర్ణీత సమయం తరువాత అనుమతి పొందినట్టుగానే భావించి నిర్మాణాలు చేపట్టవచ్చునని వివరించారు.

రైతులకు తోడ్పాటు అవసరం..
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలకు తమ భూములున్న సర్వే నంబర్లు కూడా తెలియవని, ఈ పరిస్థితి మారాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నామమాత్ర రుసు ము, ఆన్‌లైన్‌ దరఖాస్తుల తోనే భూమి రికార్డు లు రైతులకు అందు బాటులో ఉండేలా చేసేలా, వాటి ఆధారంగా బ్యాంకులు రుణా లు మంజూరు చేసేలా ప్రధాని మోదీ ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ స్వర్ణ సుబ్బా రావు, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం అధ్యక్షుడు స్టీఫెన్‌ ష్వెనిఫెస్ట్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు