దండం పెట్టే రోజులు పోయాయి

30 Jan, 2015 04:44 IST|Sakshi
దండం పెట్టే రోజులు పోయాయి

ఆర్థిక శాఖ మంత్రి  ఈటెల రాజేందర్
బిచ్కుంద: తెలంగాణ ఆవిర్భావంతో దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే రోజులు పోయాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ బీబీపాటిల్‌తో కలిసి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. మండల పరిధిలోని మిసన్‌కల్లాలి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నది మంత్రి పదవులు అనుభవించడానికి కాదన్నారు.

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్  రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఒక్క జుక్కల్ నియోజకవర్గానికే రూ.170 కోట్లు మంజూరు చేశారన్నారు. మార్చి నుంచి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంచినీటి సమస్యను అధిగమించేందుకు రూ.35వేల కోట్లతో వాట ర్‌గ్రిడ్, కరెంట్ సమస్యకు రూ.45 వేల కోట్లు వెచ్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

మూడేళ్ల తర్వాత గృహా లకు, పరిశ్రమలకు 24 గంటల పాటు, రైతులకు 7గంటల కరెంట్ ఇస్తామన్నా రు. అనంతరం గుండెనెమ్లీ గ్రామంలో విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన,  పుల్కల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం, మిషన్ కల్లాలిలో పంచాయతీ భవ నం, అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సర్పంచులు కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ సిందే, జెడ్పీ చైర్మన్  దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జేసీ రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీఓ శ్యాం ప్రసాద్ లాల్, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు గంగారెడ్డి, ప్రజా ప్రతినిధు లు, అధికారులు పాల్గొన్నారు.
 
సీమాంధ్రుల పాలనలో అడుక్కోవాల్సి వచ్చింది
నిజాంసాగర్: సీమాంధ్రుల పాలనలో అభివృద్ధి పనుల నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడుక్కోవాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలో ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులకు ఆ పరిస్థితి లేద ని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రా రంభించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల ప్రాణత్యాగాలు, ఉద్యమాల తో పాటు, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేయటానికి కృషి చేస్తున్నామని చె ప్పారు. ఇందుకోసం నిధులకు కొదువ లేదని స్పష్టం చేశారు. మూడేళ్లలో ఇం టింటికీ నల్లా నీరు అందజేస్తామన్నారు.
 
అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యం
బాన్సువాడ : అంగన్‌వాడీ కేంద్రాల్లో నూ త్వరలో సన్నరకం బియ్యం పంపి ణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి  ఆయ న స్వగృహంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌కు ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖు రాన్ వంటిదని, ఎన్నిక హామీలన్నీ తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు.

సమైక్య రాష్ర్టంలో తెలంగాణలోని 29లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 35లక్షల దాటాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన నిజామాబాద్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తొలు త మంత్రులు, ఎంపీ, జెడ్పీ చైర్మన్,  ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు