ఐదు శాతం లోపాలను సవరించుకోవాలి

10 Jun, 2020 15:23 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, నల్గొండ: మిషన్‌ భగీరథపై నల్గొండలో బుధవారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ... మిషన్‌ భగీరథ పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 40,123 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు 95 శాతం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మూడు సంవత్సరాలలో 95 శాతం పనులు పూర్తి చేయడం చారిత్రాత్మకం అన్నారు. మిగిలిన 5 శాతం పనులలో లోపాలు ఉన్నాయన్నారు. అందుకే సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలను వెంటనే అక్కడి నుంచి మార్చాలన్నారు. ఇప్పటికే చాలా మందిని మార్చం, ఇంకా కొందరిని మార్చాల్సి ఉందని ఎర్రబెల్లి తెలిపారు. ఏజెన్సీల నిర్లక్ష్యం ఈ పథకానికి శాపంగా మారకూడదన్నారు. (కోవిడ్‌కేసుల్లో చార్జ్‌షీట్స్‌! )

మరోవైపు మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కోసమే మిషన్‌ భగీరథ పథకం రూపుదాల్చింన్నారు. అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీటినిఅందించే బృహత్తర పథకం మిషన్‌ భగీరథ అని అన్నారు. ఫ్లోరిన్‌ ప్రాంతంగా ముద్రపడ్డ మునుగోడులోనే పైలాన్‌ నిర్మాణం జరిగిందన్నారు. నది జలాలు నేరుగా ఇంటింటికి అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమన్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్ట్‌ పనులు దాదాపుగా పూర్తి చేయడం ప్రసంశించదగ్గ విషయమన్నారు. పనులన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలన్నారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌ రెడ్డి, నోముల నరసింహయ్య, యన్‌ భాస్కరరావు, రవీంద్ర నాయక్‌, చిరుమర్తి లింగయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ పాల్గొన్నారు.  (వాహనాలను మార్గంలో అనుమతించడం లేదు)

మరిన్ని వార్తలు