రెండేళ్లు పూర్తిచేసుకున్న మైనార్టీ కమిషన్‌

30 Dec, 2019 05:38 IST|Sakshi

సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మైనార్టీల సమగ్రాభివృద్ధి, ఆయా రంగాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మహ్మద్‌ ఖమురుద్దీన్‌ నేతృత్వంలో 2018లో ప్రభుత్వం మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో మైనార్టీలు తమకు జరగాల్సిన న్యాయం కోసం కమిషన్‌ను సంప్రదిస్తున్నారు. చైర్మన్‌గా ప్రతినెలా క్రమం తప్పకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తూ, విచారణలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కమిషన్‌ చైర్మన్‌ ఖమురుద్దీన్‌ ‘సాక్షి’కి వివరించారు.

ఇప్పటివరకు 966 కేసులు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్‌ సంస్థలపై నమోదు అయ్యాయని, ఇందులో 802 కేసులు పరిష్కరించిన్నట్లు తెలిపారు. రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు కమిషన్‌ కృషి చేసింది. అంబేద్కర్‌ వర్సిటీలో ఉర్దూ భాషలో గ్రాడ్యుయేషన్‌ కోర్సులను అమలుచేసేలా చర్యలు తీసుకుంది. ప్రెస్‌ అకాడమీ లోగోలో ఉర్దూ భాషను చేర్పడం మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. 4 శాతం రిజర్వేషన్‌ అమలుపై దృష్టి సారించి, ఆయా శాఖల్లో మైనార్టీలకు కేటాయించిన ఖాళీ పోస్టుల వివరాలు తెలుసుకొని వాటిని భర్తీకి చర్యలు తీసుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’

సింగరేణి యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం

వెల్దండ నుంచి 54 మందిజనగామకు...

గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్‌ సీరియస్‌

కరోనా: రెండో దశలోనే తీవ్రంగా ఉంది

సినిమా

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!