ఏపీ చిన్నారికి తెలంగాణ మంత్రి సాయం

6 Apr, 2018 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెట్‌జన్లు తీసుకువచ్చే సమస్యలను తనదైన శైలిలో స్పందించించి పరిష్కరించడంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావు ఎప్పుడూ ముందుంటారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు స్పందించిన మం‍త్రి కేటీఆర్‌ మరోసారి మానవత్వం చాటుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారి కంటి ఆపరేషన్‌కు రెండు గంటల్లో రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి చిన్నారి కంటి చూపు రావడానికి కారణమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కూడా వర్తించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో భరత్‌ అనే ఓ నెట్‌జన్‌ వారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో వర్తించడంలేదంటూ సమస్యను మంత్రి కేటీఆర్‌కు వివరించాడు. చికిత్సకు సిఫారసు చేసి చిన్నారికి అండగా ఉంటాలని ట్విటర్‌లో కోరాడు. దీనిపై స్పందించిన మంత్రి తప్పక సహాయమందిస్తామని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వర్గాలతో మా‍ట్లాడి తగిన విధంగా ఆదుకుంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు