చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం

9 Mar, 2020 11:24 IST|Sakshi

సాక్షి, మిర్యాలగూడ : ఒక ప్రేమ వివాహం.. రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అటు కూతురు కుటుంబం.. ఇటు తన కుటుంబం చిన్నాభిన్నం అయింది. ఈ సంఘటనలో నిందితుడు, బాధితుడు కూడా మారుతీరావే కావడం గమనార్హం. మిర్యాలగూడలో రియల్టర్‌గా, బిల్టర్‌గా పేరు సంపాదించుకున్న తిరునగరు మారుతీరావుకు ఒక్కతే కూతురు అమృత. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకు యుక్తవయసు వచ్చే నాటికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమెకు నచ్చిన వ్యక్తి పెరుమాళ్ల ప్రణయ్‌ని 2018 జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌ మందిరంలో ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు చేసుకున్న ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో అల్లుడైన ప్రణయ్‌ని 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత జైలుకు వెళ్లడం.. ఏడు మాసాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. తిరిగి బెయిల్‌పై 2019 ఏప్రిల్‌ 28వ తేదీన మారుతీరావు మిర్యాలగూడకు వచ్చాడు.

తన కూతురు అమృత భర్తను పోగొట్టుకున్న బాధలో అత్తగారింట్లోనే ఉంది. తన కుమారుడు ప్రణయ్‌ని అల్లారుమద్దుగా పెంచుకున్న పెరుమాళ్ల బాలస్వామి దంపతులు కొడుకు హత్యకు గురైన బాధ నుంచి తేరుకోలేకపోయారు. కోడలు అమృతకు పుట్టిన కుమారుడికి నిషాన్‌ ప్రణయ్‌ అని పేరుపెట్టుకొని తన కొడుకును చూసుకుంటున్నారు. అయినా ఆ కుటుంబం ప్రణయ్‌ లేడనే బాధ నుంచి తేరుకోలేదు. కాగా ప్రణయ్‌ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య ఒంటరైంది. అటు తన కూతురు అమృత కుటుంబం, ఇటు తన కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక్క ప్రేమ వివాహం రెండు కుటుంబాలను చిధ్రం చేసింది. (అదే మారుతీరావు ప్రాణాల మీదకు తెచ్చిందా?

మరిన్ని వార్తలు