బాలుడు అదృశ్యం.. అంతలోనే విషాదం

21 Jul, 2018 08:46 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌లో గత రాత్రి తప్పిపోయిన జమీల్‌(7)ను మృత్యువు కబళించింది. బైపాస్‌ రోడ్డు వద్ద నాలాలో మృతదేహాం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు, బంధువలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు కుటుంబ సభ్యులకు మృతదేహాం అప్పగించారు. అంత్యక్రియల నిమిత్తం జమీల్‌ కుటుంబం నాందేడ్‌ నుంచి నిజామాబాద్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బాలుడి మృతదేహాం చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిజామాబాద్‌ గౌతమ్‌ నగర్‌లో బంధువు చనిపోయారని నాందేడ్‌ నుంచి రియాజ్‌ కుటుంబం నిజామాబాద్‌ వచ్చింది. అంత్యక్రియలు పూర్తి చేసుకున్న తర్వాత అందరూ ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో రియాజ్‌ కుమారుడు జమీల్‌ బయటకు వచ్చి పక్కనే ఉన్న నాలాలో పడిపోయాడు. వర్షం కురుస్తుండటంతో వరద పెరిగి ఆ నాలాలో పడి జమీల్‌ కొట్టుకుపోయాడు. ఘటనా స్థలాన్ని అధికారులు, పోలీసులు సందర్శించి గాలింపు చర్యలు చేపట్టారు.
     - వినోద్‌ కుమార్‌, ఆర్డీవో

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు