రెవెన్యూ అధికారుల లీలలు

11 Aug, 2019 11:23 IST|Sakshi

కాశీపేట మండలంలో మాయమైన రెవెన్యూ రికార్డులు లభ్యం

రియల్‌ ఎస్టేట్‌తో కాశీపేట భూములకు రెక్కలు

సాక్షి, బెల్లంపల్లి: నియోజకవర్గంలో కాశీపేట మండల రెవెన్యూ అధికారుల లీలలతో స్థానికులు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని మాయమైన రెవెన్యూ రికార్డులు ఆదివారం ఉదయం  లభ్యమయ్యాయి. రికార్డులు మాయం కావడంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీపేట మండలంలో 22 గ్రామాలు ఉండగా.. రియల్‌ ఎస్టేట్‌తో భూముల ధరలు అమాంతం పెరిగాయి.

అటు ఓసీపీ నిర్వాసిత గ్రామాలు కూడా ఉండటంతో పెద్దఎత్తున చేతివాటం ప్రదర్శించేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత వారం రోజులుగా పోలీసులు విచారిస్తునట్లు సమాచారం. శనివారం కూడా కాశీపేట మండల పరిధిలోని వీఆర్వోలను పోలీసులు విచారించారు. అయితే మాయమైన రికార్డులు అనూహ్యంగా ఆదివారం ప్రత్యక్షం అయ్యాయి. రికార్డులను ఇవాళ ఉదయం ఎమ్మార్వో కార్యాలయం వద్ద పడేసి వెళ్లినట్లు సమాచారం. ఉదయం అయిదు గంటలకే ఇద్దరు వీఆర్‌ఏలు అక్కడకు రావటంతో ...వాళ్లే ఆ రికార్డులు తెచ్చి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


 

మరిన్ని వార్తలు