పొలాలను ముంచిన మిషన్‌ భగీరథ

15 Nov, 2018 15:43 IST|Sakshi

సాక్షి,చిగురుమామిడి: మండలంలోని కొండాపూర్‌ గ్రామ ఊరచెరువు దగ్గర మిషన్‌భగీరథ మెయిన్‌ పైపులైన్‌ పగిలి నీరు వృథాగా పోతోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పైపుల నుంచి నీరు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో కోతకు వచ్చిన పంట నీటితో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కోసే వరి నీటమునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్ర స్వామి, బింగి మల్లయ్య, బుర్ర శ్రీనివాస్‌లకు చెందిన పంటలు నీటమునిగాయని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇంకిపోయే వరకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పగిలిన పైపులైన్‌ను మరమ్మతు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా