జర ఆగండి..

20 Mar, 2015 00:20 IST|Sakshi

‘మిషన్’లో మేమూ భాగస్వాములవుతాం !
 అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి.. పూడికతీత పనులకు బ్రేక్
 
వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నారుు. ఎన్నికల కోడ్ కారణంగా భాగస్వాములం కాలేకపోతుండడంతో పనులు వారుుదా చేసేలా పలువురు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఫలితంగా చెరువుల పూడికతీత పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో ఈఏడాది 1179 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు పలు విడతలుగా 692 చెరువుల పునురుద్ధరణకు రూ.291కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు సర్కిల్, డివిజన్ల పరిధిలో 682పనులకు టెండర్లు నిర్వహించారు. దక్కించుకున్న ఏజెన్సీలు ఈనెల 13 వరకు 351 చెరువుల్లో పనులు ప్రారంభించేందుకు అగ్రిమెంటు పూర్తి చేసుకున్నారుు.

కానీ...  జిల్లా కేంద్రంలోని నీటిపారుదల కార్యాలయంలో మిషన్ కాకతీ పైలాన్ నిర్మాణంలో జాప్యం జరగడం... ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో పైలాన్ ప్రారంభం ఊసే లేకుండా పోయింది. అరుుతే మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులను వేగిరం చేయాలని ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి ఆదేశాలు అమలు చేయాలా.... స్థానిక నేతల మాటలను వినాలో తెలియని సంకటస్థితిలో నీటిపారుదల శాఖ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. పూడిక తీత పనుల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రావడంతో పనులను ప్రారంభించక తప్పని పరిస్థితి నెలకొనడంతో వారు తలపట్టుకుంటున్నారు.
 
పూడికతీతకు స్వల్ప విరామం...

అధికారికంగా మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యూరుు.  మొదటి రెండు రోజుల్లో 40కి పైగా చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభం కాగా... గురువారం నాటికి అవి సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కోడ్ కారణంగా పాల్గొనలేని ప్రజాప్రతినిధులు ఆయా మండలాలకు చెందిన ఇరిగేషన్ అధికారులపై జిల్లా, రాష్ట్ర స్థారుులో ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఎమ్మెల్సీ కోడ్ మరో నాలుగు రోజుల్లో తొలగిపోతున్నందున అప్పటివరకు పనులను ప్రారంభించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  దీంతో ఇప్పటివరకు ప్రారంభమైన పనులకు బ్రేక్ పడిట్లేనని తెలుస్తోంది. కాగా, చెరువుల పునరుద్ధరణలో ఎలాంటి జాప్యం జరగడం లేదని... చెరువుల్లో ఉన్న చెత్తాచెదారం, కట్టపై ఉన్న జంగిల్ క్లియరెన్స్‌ను పూర్తి చేసిన అనంతరం పూడికతీత పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు అధికారులు చెబుతుండడం విశేషం.
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దామరచర్ల’కు డబుల్‌ ట్రాక్‌ లైన్‌

ఎర్రమంజిల్‌ భవనాన్ని హెచ్‌ఎండీఏ కాపాడాలి 

భూ రికార్డులను సంస్కరించాలి 

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

రుణమాఫీ గజిబిజి

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని టవర్‌ ఎక్కిన వ్యక్తి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

డొక్కు బస్సులే దిక్కు !

పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు

కథ కంచికేనా !

డెంగీ.. డేంజర్‌

ఇక ఇంటికే  ఈ– చలాన్‌ 

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

భాష లేనిది.. నవ్వించే నిధి

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

నా కొడుకును బతికించరూ..

చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌