ఇంటర్‌ కెమిస్ట్రీ, కామర్స్‌ పేపర్లలో తప్పులు

18 Mar, 2020 01:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలు..

ఆ 3 ప్రశ్నలు రాసిన వారందరికీ మార్కులు: సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్‌ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు దొర్లాయి. అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు గందరగోళపడ్డారు. అయితే ఇంటర్‌ బోర్డు అధికారులు ఆ తర్వాత అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఏయే ప్రశ్నల్లో ఉన్నాయో పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి, విద్యార్థులకు తెలియజేశారు. కామర్స్‌ తెలుగు మీడియం ఓల్డ్‌ సిలబస్‌లో 3 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. వాటికి జవా బులు రాసిన (తప్పైనా, ఒప్పైనా) వారందరికీ మార్కులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈ పరీక్షలు రాసేందుకు 5,03,429 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 4,78,987 మంది హాజరయ్యారు. ఇక 26 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

పూర్తయిన ప్రథమ సంవత్సర ప్రధాన పరీక్షలు: 
ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. ఈ నెల 19, 21 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ద్వితీయ సంవత్సర ప్రధాన పరీక్షలు ఈ నెల 18తో పూర్తికానున్నాయి. 20, 23 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి.
 
ఇవీ ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు.. 
- కామర్స్‌–1 తెలుగు మీడియం (ఓల్డ్‌ సిలబస్‌) సెక్షన్‌–డి 18వ ప్రశ్నలో డెబిట్‌ వైపు అప్పులకు బదులుగా క్రెడిట్‌ నిలువలు అని ఉండాలి.  
తెలుగు మీడియం (న్యూ సిలబస్‌) కామర్స్‌–1లో 16వ ప్రశ్నలో నిలి అని ఉంది. అక్కడ నిలిపి అని ఉండాలి. 
- సెక్షన్‌–ఈ 19వ ప్రశ్నలో తేదీ 8లో చెక్కును బ్యాంకులో డిపాజిట్‌ చేశారు అని ఉండాలి.  
- సెక్షన్‌–ఎఫ్‌లో 22వ ప్రశ్నలో తేదీ 5న వంశీకి అమ్మిన సరుకుకు బదులుగా వంశీ నుంచి కొన్న సరుకు అని ఉండాలి. అలాగే తేదీ 10లో వంశీకి అమ్మిన సరుకు రూ.1,200 అని ఉండాలి. ఇదీ ప్రింట్‌ కాలేదు.  
- సెక్షన్‌–ఎఫ్‌లో 23వ ప్రశ్నలో 2018 అని పొరపాటుగా వచ్చింది.  
- సెక్షన్‌–జీలో 31వ ప్రశ్నలో రుణగ్రస్తులు రూ.28,000 అని ఉండడానికి బదులుగా రూ.22,000 అని వచ్చింది. 
- కెమిస్ట్రీ–1లో (ఇంగ్లిష్‌ మీడియం) సెక్షన్‌–బి 14వ ప్రశ్నలో ప్రశ్న చివరలో  ఠీజ్టీజి ్చn ్ఛ్ఠ్చఝp ్ఛ అని ఉండాలి. 
సెక్షన్‌–జీలో 27వ ప్రశ్నలో  ్కఅఐఈ ఇఏఉఖ్ఖఉ  బదులుగా  ్కఅఐఈ  అఔఅఖఐఉ   అని ఉండాలి. 
- కెమిస్ట్రీ–1లో (తెలుగు మీడియం) సెక్షన్‌–బీలో 15వ ప్రశ్నలో 10.6 శాతానికి బదులుగా 10.06 శాతం అని ఉండాలి. 
- సెక్షన్‌–బీలో 16వ ప్రశ్నలో  ఏ్గఈఐఈఉకు బదులుగా  ఏ్గఈఖఐఈఉ అని ఉండాలి. 

మరిన్ని వార్తలు