మీ సేవకు మా సలాం

9 Apr, 2020 13:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కోరల్లో చిక్కుకొని ప్రతి ఒక్కరూ అల్లడిపోతున్నారు. రాణి, రాజు, దేశ ప్రధానుల నుంచి సామాన్యలు వరకు కరోనా బారిన పడి విలవిలలాడిపోతున్నారు. ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ మహమ్మారిని కట్టడిచేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దీని వల్ల వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లలేక ఉన్నచోట పనిలేక తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు వలస కూలీలు, నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ముందుకు వస్తున్నారు. 

ఇందులో భాగంగానే 24 గంటలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలు భద్రత కోసం పనిచేస్తోన్న పోలీసువారు కూడా తమ డ్యూటీతో పాటు పేదలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీసులు రూ. 700 విలువగల నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబంలో నలుగురి వ్యక్తులకు సరిపడా సరుకులను కిట్‌ల ద్వారా అందిస్తున్నారు. ప్రతి కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ పప్పు, 100 గ్రాముల చింతపండు, ఒక కేజీ ఉప్పు, ఒక కేజీ చక్కెర, చిన్న కారం ప్యాకెట్‌, ఒక లీటరు ఆయిల్‌ ప్యాకెట్‌, 70 గ్రామల టీ పౌండర్‌ ఉంటాయి . ఈ కార్యక్రమంలో పోలీసులతో కలిసి సామన్యులు సైతం పాలుపంచుకుంటున్నారు. వారికి తోచిన సాయం పోలీసుల ద్వారా చేస్తున్నారు. సామాన్యల సాయంతో  వచ్చిన డబ్బుతో   మియాపూర్‌ పోలీసులు వలసకూలీలకు, దినసరి కూలీలకు, నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించి వారిని ఆదుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు