'నాణ్యత లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లోకే..'

16 Apr, 2016 15:01 IST|Sakshi

టేక్మాల్ (మెదక్) : మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ హెచ్చరించారు. శనివారం మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామంలోని గటంగారోల్ల కుంటలో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పనులను నాణ్యంగా, త్వరితగతిన చేయకుంటే లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. పనులపై అశ్రద్ధ వద్దని, ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. టేక్మాల్ మండలంలో రెండో విడత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 35 చెరువుల పనులకు రూ.17.23 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు