కాంగ్రెస్‌కు మంచిరోజులు : ఎమ్మెల్యే చిన్నారెడ్డి

7 May, 2018 09:26 IST|Sakshi
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే ​​​​​

వనపర్తి అర్బన్‌ : కాంగ్రెస్‌కు మంచిరోజులు వస్తున్నాయని ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. మండలంలోని కాశీంనగర్‌ గ్రామ పంచాయతీ  పరిధిలోని కందిరీగ తండాలో ఆదివారం పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కమిటీలతో పాటు మహిళా విభాగం, యువజన విభాగం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అంజనగిరి తండా, మేఘ్యతండా, కందిరీత తండా, ఎద్దుల గేరీ, నాగమ్మతండా, కాశీంనగర్, ఎర్రగట్టుతండాల్లో కమిటీలు వేశారు. కార్యక్రమంలో రమేష్‌నాయక్, లాలునాయక్, మన్యంనాయక్,  శివసేనారెడ్డి, ధనలక్ష్మీ, సహదేవ్, తిరుపతయ్య, కిరణ్, సత్యంసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు