జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి

9 Jun, 2016 00:32 IST|Sakshi

ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేయడం తగదు
టీఆర్‌ఎస్ నాయకులు

 

జనగామ : జనగామ జిల్లా కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొదటి నుంచి ఎనలేని కృషి చేస్తూనే, ఉద్యమంలో కీ లక పాత్ర పోషించాడని మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మండల అధ్యక్షులు మేకల కలింగరాజు, పసుల ఏబేలు, కారింగుల రఘువీరారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొణ్యా ల జనార్దన్‌రెడ్డి, కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, ఎజాజ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా ఏర్పాటు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు కావాల్సిన పూర్తి నివేదికను చీఫ్ సెక్రెటరీ రాజీ వ్ శర్మకు ఎమ్మెల్యే అందజేశారని అన్నారు. జనగామ జిల్లా కావడం లేద ని వస్తున్న పుకార్లలో నిజం లేదని, హైదరాబాద్‌లో ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గొంగిడి సునీతను కలుపుకుని ముత్తిరెడ్డి సీఎంను కలిసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఉద్యమంలో అధికార పార్టీ కీలకపాత్ర వహించడమే కాకుండా, ఎమ్మెల్యే స్వయంగా దీక్షలను సందర్శించి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే దిష్టిబొమ్మలతో యాత్ర చేయడం సరి కాదన్నారు. అధికార పార్టీలో ఉంటూ జిల్లా కోసం తామంతా పనిచేస్తుంటే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎక్కడ ఉన్నారో ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.


కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు చేర్యాల, మద్దూరును సిద్ధిపేటలో కలపాలని డిమాండ్ చేస్తూ, ఒకే నియోజకవర్గంలో రెండు రకాల ఉద్యమాలను చే స్తూ జిల్లా రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జిల్లా సాధనలో పార్టీలకతీతంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి తామంతా ముందుండి పోరాడుతామని తెలిపారు. జిల్లా కోసం పనిచేసే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆయనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు ఆలూరి రమేష్, ఉల్లెంగుల కృష్ణ, రామకృష్ణ, సింగరి ప్రశాంత్ ఉన్నారు.

 

మరిన్ని వార్తలు