'ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఒరగబెట్టిందేమి లేదు'

21 Sep, 2019 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి మాదిగలకు ఉపముఖ్యమంత్రి పదవిఘిచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ .. మంత్రి పదవి లేనంత మాత్రానా మాదిగలకు ఎలాంటి నష్టం జరగదని,  కేసీఆర్‌ ఎన్నటికి మాదిగల వెన్నంటే ఉంటారని స్పస్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏం ఒరగబెట్టలేదని విమర్శించారు. ఎస్సీలకు సంబంధించిన ఎ,బి,సి,డిల వర్గీకరణ కేసీఆర్‌ హయాంలోనే జరుగుతుందని విశ్వసించారు. ఎస్సీ వర్గీకరణను తమకు వదిలేయాలంటున్న మందకృష్ణను,  ఆయన చూపిస్తున్న కమట ప్రేమను మాదిగలు నమ్మొద్దని హితవు పలికారు.

మందకృష్ణ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, మాదిగ ఉపకులానికి చెందిన కడియం శ్రీహరి​కి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తులేదా అంటూ మరో ఎమ్మెల్యే ఆరూరూ రమేశ్‌ తెలిపారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పక్కదారి పట్టించారని, సబ్‌ప్లాన్‌కు సంబంధించిన నిధులు దుర్వినియోగం కాకుండా కేసీఆర్‌ ప్రత్యేక చట్టం చేసిన సంగతి గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు