అది వినాశనానికి దారి తీస్తుంది:హరీశ్‌ రావు

30 Jul, 2019 15:34 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: నేను అనుకోకుండా మనము అనుకున్నపుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లను నాటి వాటి సంరక్షణకు గ్రామాల్లోని మహిళలను, కుల సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎన్ని చెట్లను నాటినప్పటికి వాటిని సంరక్షించే వారు లేకుంటే ఆ కార్యక్రమం వృథా అవుతుందన్నారు. మనం ఎన్నిపనులు చేసిన చెట్లను సంరక్షించే పని చాలా గొప్పదన్నారు. ప్రతి ఒక్కరు పకృతి సంరక్షణకు నడుం బిగించి చెట్లను నాటి వాటి సంరక్షించాలని కోరారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మన వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు