‘సోషల్‌ మీడియాతో మరింత బలహీనమవుతున్నాం’

2 Aug, 2019 16:19 IST|Sakshi

సాహితీ సదస్సులో ఎమ్మెల్యే హరీష్‌రావు

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమంలో సాహితీవేత్తల సేవలు మరువలేనివని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సాహితీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. సాహిత్యంతో సమాజంలో మార్పు దిశగా చైతన్యం తీసుకురావాలన్నారు. అదే విధంగా పద్యాలు సామాజిక బాధ్యతను గుర్తుచేసేవిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భాష, చరిత్రను యువతరం తెలుసుకుంటూ.. భావితరానికి స్ఫూర్తిని అందించే బాధ్యత తీసుకోవాలన్నారు.

దీంతో పాటు ఆకు పచ్చ, ఆరోగ్య తెలంగాణ దిశగా రచనలు సాగాలని హరీష్‌ పేర్కొన్నారు. కాగా,యువత మంచిమార్గం వైపు నడవడానికి సాహిత్యం తోడుగా నిలవాలని ఆకాంక్షించారు. సెల్‌ఫోన్లు ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని.. సోషల్‌ మీడియాతో మనిషి మరింత బలహీనం అవుతున్నాడని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి సాహితీ సదస్సుకు సిద్దిపేట వేదిక కావటం గర్వకారణంగా ఉందని హరీష్‌ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు