మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

7 May, 2020 11:16 IST|Sakshi
ముంబై వాసులతో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

పెళ్లికి వచ్చి పార్శిగుట్టలో చిక్కుకుపోయిన ముంబై వాసులు

సొంత డబ్బుతో స్వస్థలానికి పంపిన ముఠా గోపాల్‌

కవాడిగూడ: బంధువుల పెండ్లికి వచ్చిన   పలువురు ముంబై వాసులు లాక్‌డౌన్‌ కారణంగా నగరంలోనే ఇరుక్కుపోయారు. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయి తమది కాని రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ ఓ పూట తింటూ ఓ పూట పస్తులుంటున్న వారు సాయం కోసం కనపడిన వారినందరినీ ప్రాధేయపడ్డారు. ఈ విషయం కాస్తా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ దృష్టికి రావడంతో.. నేనున్నాంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. వారిని మహారాష్ట్ర తరలించేందుకు తన సొంత డబ్బు లక్ష రూపాయలతో ఏర్పాట్లు చేశారు.  ఇందుకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులతో మాటాడి వారి స్వస్థలాలకు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌.

పార్శిగుట్టకు చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమారుడి వివాహం మార్చి 19న జరిగింది.  వివాహానానికి ముంబై నుంచి 30 మంది దాకా వచ్చారు. అనంతరం 30 మందిలో పదిమంది ముంబైకి వెళ్లిపోగా 20 మంది సిటీని వీక్షించి 23న వెళ్లేందుకు ట్రైన్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నారు. మార్చి 22న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇక్కడే ఓ కిరాయి ఇంటిలో ఉంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆయన వారు ముంబై వెళ్లేందుకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలను భర్తిస్తానని, ఇందుకు అనుమతులివ్వాడంటూ కలెక్టర్‌ను కోరారు. తక్షణం అధికారులు స్పందించడంతో ఈ నెల 4న (సోమవారం) వారు ఇక్కడ నుంచి ముంబైకి వెళ్లారు. దేవుడిలా తమను ఆదుకున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామంటూ వారు భావోద్వేగంతో ముఠా గోపాల్‌కు కృతజ్ఞలు తెలిపారు.

మరిన్ని వార్తలు