నిమ్స్‌లో ఎమ్మెల్యే రాజయ్య దీక్ష విరమణ

4 Jun, 2014 01:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పోలవరం డిజైన్ మార్చడంతో పాటు ముంపునకు గురయ్యే మండలాలను ఖమ్మంజిల్లాలోనే ఉంచాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్గ ప్రతినిధి బృందం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రాజయ్య వద్దకు మంగళవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ నేతృత్వం లోని ప్రతినిధి బృందం వచ్చింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉమ్మడిగా కలిసి పోరాటం చేద్దామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారని పేర్కొని, రాజయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.  పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచటానికి అన్ని రకాల పోరాటాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రులు నాయిని, ఈటెల మీడియాతో చెప్పారు.

మరిన్ని వార్తలు